రక్త చరిత్ర పై బాలయ్య, జూ ఎన్టీఆర్ మౌనం...షాక్ తిన్న అభిమానులు...
ఇటీవల విడుదలైన 'రక్తచరిత్ర" సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ పాత్రను విలన్ గా చూపించాడని ఈ చిత్ర దర్శకడు రామ్ గోపాల్ వర్మ పై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తపరిచారు. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, తెదేపా అధినేత, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి తమ బాధను వ్యక్తపరిచి ఆ సీన్స్ తొలిగించాల్సిందిగా దర్శకుడిని కోరారు.
కానీ ఎన్టీఆర్ నట వారసులైన నందమూరి బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ ఈ వివాదం పై స్పందించకపోవడం నందమూరి అభిమానులను షాక్ కు గురి చేసిందట. వీరు ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా అభిమానులను షాక్ కు గురి చేసిందట. వీరు ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా అభిమానులు వాపోతున్నారని సమాచారమ్. కానీ బాలకృష్ణ 'పరమవీర చక్ర" షూటింగ్ నిమిత్తం కులుమనాలీలో ఉన్నాడు. అక్కడ సినిమా చూసి వెంటనే నిర్మాత సి కళ్యాణ్ కు ఫోన్ చేసి తన తండ్రి ఎన్టీఆర్ ని అవమానించే విధంగా ఉన్న సీన్స్ ని తొలిగించాల్సిందిగా అజ్ఝాపించాడట. వెంటనే కళ్యాణ్ కూడా ఈ విషయంపై స్పందించి ఈ సీన్స్ ను తొలిగించాడని తెలుస్తోంది. కాకపోతే బాలయ్య స్పందించిన విషయం మీడియాలో రాకపోవడంతో ఈ విషయం బయటికిరాలేదు.


Click it and Unblock the Notifications











