టైమొచ్చింది: బాబాయ్, అబ్బాయ్ ఒకే వేదికపై...
హైదరాబాద్: బాబాయ్, అబ్బాయి లు... బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ లు ఒకే వేదికపై కనిపించనున్నారా..అవుననే వినపడుతోంది. వీరిద్దరూ కలిసి ఓ ఆడియో పంక్షన్ కి హాజరవుతున్నారు. అది మరేదో కాదు...కళ్యాణ్‌రామ్‌నటిస్తున్న ‘పటాస్' చిత్ర ఆడియో ఆవిష్కరణకు బాలయ్య, ఎన్టీఆర్‌లు హాజరుకాబోతున్నారు. గత రెండేళ్లుగా వాళ్లిద్దరూఏ కార్యక్రమంలోనూ కలిసింది లేదు దాంతో ఈ విషయమై అంచనాలు పెరుగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... ఆదివారం ‘పటాస్' ఆడియో విడుదల కార్యక్రమంలో బాలయ్య, ఎన్టీఆర్‌లు ఒకే వేదికపై కనపడబోతున్నారు. ఇటీవల జరిగిన ‘మేముసైతం'కార్యక్రమంలో ఎన్టీఆర్.. బాలకృష్ణను (బాబాయ్ పాటను) పొగడ్తలతో ముంచెత్తిన సంగతితెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సయోధ్య కుదురుతోందని మీడియా వర్గాలు అంటున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం నాడు తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించారు. బాబాయ్ (బాలకృష్ణ) పాటలు పాడటం తాను చూశానని, బ్రహ్మాండంగా పాడారని చెప్పారు.

ఇక ‘పటాస్' విషయానికి వస్తే...
ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ బ్యానర్‌పై సొంతంగా నటిస్తూనిర్మిస్తున్న చిత్రం కావడంతో కళ్యాణ్‌రామ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఇటీవల విడుదల చేసిన పటాస్ టీజర్‌కు మంచి స్పందన రావడం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.
‘ పటాస్ ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకుంది. అయితే, ‘టెంపర్' మీదన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఈ చిత్రం పోటీ వస్తుందా అనే అనుమానంలో నందమూరి అభిమానులు ఉన్నారు. టెంపర్ పోస్టర్ విడుదల చేసిన కొన్ని గంటలకే పటాస్ పోస్టర్ రిలీజ్ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కథ విషయానికి వస్తే అటు టెంపర్‌లోనూ ఇటు పటాస్‌లోనూ ఇద్దరూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపిస్తుండడం విశేషం. టెంపర్ కన్నా ముందే పటాస్ విడుదల అయ్యే అవకాశం ఉందనే టాక్ వినబడుతోంది. చాల కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంతోనైనా హిట్ సాధించాలనుకుంటున్నాడు. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 7న విడుదల చేసే ఆలోచనలో రామ్ ఉన్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూర్చగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: సర్వేశ్ మురారి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: ఎం.కిరణ్‌కుమార్, ఫైట్స్: పటాస్ వెంకట్, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.


Click it and Unblock the Notifications











