టిడిపి వారసులు బాలయ్య, జూ ఎన్టీఆర్ లైతే బాబు పప్పులుడకవు!

By Sindhu

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడైనా, సీఎం అయినా మొత్తం చంద్రబాబే(వే) అని అన్నారు బాలకృష్ణ. నేను కానీ, జూ ఎన్టీఆర్ కానీ నామమాత్రులమే అని 'సింహా" చిత్ర విజయయాత్రలో భాగంగా బుదవారం చివరిదైన ధర్మపురి లక్ష్మీనరసింహా క్షేత్రాన్ని దర్శించుకున్న బాలయ్య మీడియాకు తెలిపారు. రేపు జరగబోవు మహానాడులో కూడా ఇదే చెబుతానని ఆయన తెలుపుతున్నారు. నాన్న గారి తర్వాత తెలుగు దేశం పార్టీకి కర్త, కర్మ అన్నీ బాబే చూసుకుంటున్నారు. నాన్నగారు స్థాపించిన పార్టీ కాబట్టి మేమంతా పార్టీ వెంటే ఉండి యోగా క్షేమాలు తెలుసుకోవడమే తమ కర్తవ్యం అని ఆయన తెలియజేశారు.

పార్టీకి కార్యకర్తగా ఉండటం తప్ప తాను పార్టీలో ఎటువంటి పదవులు ఆశించడం లేదని పార్ఠీ అధ్యక్షుడైనా సీఎం గా ఉండేదైనా బావ బాబే అని ఆయన స్పష్టం చేశారు. మరి కొన్ని రోజుల క్రితం అవసరమైతే పార్టీ పగ్గాలు చేపడతానని ఆయన పలికిన తీరు ఇప్పుడు పలుకుతున్న తీరు చూస్తుంటే బాలయ్య ఇంకా మాట్లాడటం నేర్చుకోలేదని అందుకే బాలయ్యను చంద్రబాబు చక్కగా వాడుకుంటున్నాడనీ ఆయన మాట తీరు చూసిన వారంతా అనుకోవడం విశేషం.

అయితే చంద్ర బాబు మాత్రం టిడీపి తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీశరవేగంగా సాగుతున్పాయి. ఈ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో బాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ సినిమాలలో బిజీగా ఉండటంవల్ల రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. వారు రాజకీయ పగ్గాలు చేపడతామంటే సాదరాభిమానంగా ఆహ్వానిస్తామన్నారు. అదే గనుక జరిగితే బాబు పప్పులు ఉడకవని నందమూరి అభిమానులు బిగ్గరగా అంటున్నారు.

జరగబోయే టిడిపీ మహానాడుకి బాలయ్య, జూ ఎన్టీఆర్ లు వస్తున్నారని తెలియడంతో నందమూరి, తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగి పొర్లుతుందని సమాచారం. ఈ మహానాడులో టిడిపి వారసులు బాలయ్య, జూ ఎన్టీఆర్ లే అని ఢంకా మ్రోగించడానికి వారంతా రెడీ అవుతున్నారని సమాచరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X