twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తతో కలసి విద్యాబాలన్.. థియేటర్‌లో బాలయ్య, కళ్యాణ్ రామ్ సందడి!

    |

    Recommended Video

    NTR Biopic : Balakrishna, Vidya Balan, Kalyan Ram Watching Movie @ Bramaramba Theatre

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రలో నందమూరి అభిమానులు థియేటర్స్ వద్ద పెద్ద ఎత్తున కోలాహలం చేస్తున్నారు. ఎన్టీఆర్, బాలయ్య చిత్ర పటాలకు పాలాభిషేకం, పూలమాలలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కేవలం సినీవర్గాల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్టీఆర్ చిత్ర యూనిట్ ఈ తెల్లవారు జామున కూకట్ పల్లిలోని బ్రమరాంభ థియేటర్ లో సందడి చేశారు.

    భర్తతో కలసి

    భర్తతో కలసి

    ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అద్భుతంగా ఓడిపోయాడనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య తరువాత అంత ఆసక్తికరమైన పాత్రలో విద్యాబాలన్ నటించింది. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్యతో విద్యాబాలన్ భారీ స్థాయిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. విద్య బాలన్ తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో కలసి భ్రమరాంబ థియేటర్ లో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని వీక్షించడం విశేషం.

    బాలయ్య, కళ్యాణ్ రామ్ సందడి

    బాలయ్య, కళ్యాణ్ రామ్ సందడి

    భ్రమరాంభ థియేటర్ లో వేసిన ప్రత్యేక షోని బాలయ్య, కళ్యాణ్ రామ్, దర్శకుడు క్రిష్, ఇతర చిత్ర సభ్యులు వీక్షించారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రలో అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర సందడి స్ఫష్టంగా కనిపిస్తోంది.

    కళ్ళకు కట్టినట్లుగా

    కళ్ళకు కట్టినట్లుగా

    దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. బాలయ్య గెటప్ నుంచి, ప్రముఖమైన పాత్రలకు నటీనటుల్ని ఎంపిక చేసుకోవడం ఇలా అన్ని అంశాల్లో క్రిష్ తన ప్రతిభ చూపించారు. విద్యాబాలన్ ఈ చిత్రంలో నటింపజేసేందుకు చివరి వరకు ప్రయత్నించిన బాలయ్య, క్రిష్ విజయం సాధించారు. కళ్యాణ్ రామ్, రానా, సుమంత్ పాత్రల విషయంలో క్రిష్ స్పెషల్ కేర్ తీసుకున్నాడు.

     అచ్చం అలాగే

    అచ్చం అలాగే

    హీరో సుమంత్ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో అచ్చు ఏఎన్నార్ లాగే మారిపోయాడు. ఓ సందర్భంలో బాలయ్య రానా పాత్ర గురించి మాట్లాడుతూ గడ్డంతో ఉంటె రానా, తీసేస్తే చంద్రబాబు అని అభివర్ణించాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన తండ్రి పాత్రలో నటించడం కష్టమైన పని అయినా బాబాయ్, క్రిష్ సహకారంతో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశానని తెలిపాడు.

    English summary
    Balakrishna, Krish and Kalyan Ram at NTR Kathanayakudu screening. Vidya Balan along with his husband
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X