నందీశ్వరుడుగా అభిమానులను అలరించడానికి సిధ్దమైన బాలకృష్ణ...!
సింహా హిట్ తర్వాత బాలయ్యబాబు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. దానికి కారణం బాలయ్యబాబు ఎక్కువసినిమాలు చెయ్యడమే. ప్రస్తుతం దాసరి నారాయణరావు దర్శకత్వంలో పరమవీరచక్ర గా నటిస్తున్న విషయం అందిరకి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యబాబు రెండు ప్రత్యేకమైన గెటప్స్ తోకనిపించనున్నారు. అటు తర్వాత ఆంధ్రుడు మరియు రెచ్చిపో లాంటి సినిమాలు తీసినటువంటి పరుచూరి మరళి దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రారంభం అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యంలాంటి పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాని యలమంచిలి సాయి నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బాలయ్యబాబుకి గతంలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ మరియు నరసింహానాయుడు లాంటి అఖండ విజయాలను అదేవిధంగా పలనాటి బ్రహ్మానాయుడు లాంటి అట్టర్ ప్లాప్ సినిమానిచ్చినటువంటి బిగోపాల్ డైరెక్షన్ లో మరో హారహార మహాదేవ సినిమాకి శ్రీకారం చుట్టిన విషయం తెలసిందే. ఇక నందమూరి వంశం సోంత బ్యానర్ అయినటువంటి రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై బాలయ్యబాబు హీరోగా ఓ సినిమా రూపోందించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి నందీశ్వరుడు అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఫిలిమ్ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బాలయ్యబాబు పరమవీరచక్ర మరియు పరుచూరి మురళి సినిమాలలో చాలా బిజిగా ఉన్నారు. అదేవిధంగా బి గోపాల్, బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మొదలవుతుందని అన్నారు. ఈ దెబ్బతో తెలుగు సినిమా ఇండస్టీ ఎక్కడికో పోతుందని బాలయ్యబాబు అభిమానులు ఆశపడుతున్నారు.


Click it and Unblock the Notifications











