బాలయ్య ద్వారా ‘మిర్చి లాంటి కుర్రాడు’

By Bojja Kumar

హైదరాబాద్: యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక నవంబర్ 13న హైదరాబాద్ లోని జే.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో ప్లాన్ చేసారు. ఈ చిత్రం ఆడియో వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న చిత్రానికి రుద్రపాటి రామారావే కావడంతో ఆయన ఆహ్వానం మేరకు ఈ ఆడియో వేడుకకు హాజరవుతున్నారు బాలయ్య.

సినిమా గురించి నిరమాత మాట్లాడుతూ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. చిత్రీకరణ పూర్తయ్యింది. లవ్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ''చక్కటి లవ్ స్టోరీ. యాక్షన్ నేపధ్యం ఉన్న కథకు వినోదం, లవ్ జోడించాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. వీరబాబు డైలాగ్స్, జెబి మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయి'' అని అన్నారు.

Balakrishna to launch Mirchi Lanti Kurradu audio

హీరో అభిజిత్ మాట్లాడుతూ ''చాలా పవర్ ఫుల్ టైటిల్ ఇది. టైటిల్ బట్టి ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటన్ టైనర్ అనుకునే అవకాశం ఉంది. కానీ కథకు ఎంత అవసరమో అంతే యాక్షన్ ఈ సినిమాలో ఉంటుంది. లవ్, సెంటిమెంట్, కామెడీ అన్నీ ఈ చిత్రానికి చక్కగా కుదిరాయి అన్నారు.

ఈ చిత్రంలో రావు రమేష్, నాగినీడు, సప్తగిరి, సుప్రిత్, రజిత, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం - జె.బి, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, కెమెరా - ఆర్.ఎం.స్వామి, మాటలు - వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రాజు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X