నందమూరి ఫ్యామిలీ నుంచి హీరో రీ ఎంట్రీ.. 19 ఏళ్ళ తరువాత ఈ సారి గట్టి ప్లాన్ తో!
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే అనేక మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే వారందరిలో కూడా కేవలం ఇద్దరు మాత్రమే రామారావు నట వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ స్టేటస్ ఎక్కించుకున్నారు.. తారకరత్న, కళ్యాణ్ రామ్ వంటి వారు ఇప్పటికీ కూడా స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే 2003వ సంవత్సరంలో సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video


నట వారసుడిగా
నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన నట వారసుడిగా హరికృష్ణ, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, తారకరత్న హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒక మాదిరిగా హీరోలుగా రాణిస్తున్నారు. కానీ హరికృష్ణ కొన్ని సినిమాల్లో హీరోగా చేసి తప్పుకున్నారు. తారకరత్న కూడా ఒకప్పుడు స్టార్ స్టేటస్ కి దగ్గర అయ్యాక కూడా తర్వాత సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒకటి అరా ప్రాజెక్టులలో ఆయన కనిపిస్తున్నారు కానీ స్టార్ అని చెప్పలేము.
సుదీర్ఘ విరామం తరువాత
ఇక ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగ్రేటం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. నందమూరి చైతన్య కృష్ణ 2003 లో జగపతిబాబు హీరోగా రూపొందిన ధమ్సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. కానీ అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడంతో గత కొంత కాలంగా సినిమాలకు చైతన్య కృష్ణ దూరంగా వుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు సుదీర్ఘ విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరో కారణం
బసవతారక రామ క్రియేషన్స్ బ్యానర్ పై నందమూరి జయకృష్ణ ఈ మూవీని నిర్మించబోతున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. 'రక్ష', 'జక్కన్న' సినిమాలు చేసి ఇప్పుడు టైగర్ నాగేశ్వర్ రావు తెరకెక్కిస్తున్న దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వంశీకృష్ణ చెప్పిన కథ నచ్చడమే కాక ఆయనతో ఈ సినిమా చేయడానికి కూడా మరో కారణం ఉందని అంటున్నారు.

మరో కారణం
అదేమిటి అంటే రవితేజ హీరోగా స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వర రావు జీవిత కథ రూపొందిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున విడుదలయ్యే అవకాశం ఉంది..

రెండు మూడు భాషలలో
ఆ తర్వాత సినిమా బాగుంటే దర్శకుడికి కూడా మంచి క్రేజ్ లభించే అవకాశం కూడా ఉంది. ఆ సినిమా హిట్ అయితే కనుక తమ సినిమాను మరో రెండు మూడు భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేసే అవకాశం కూడా ఉందని నందమూరి కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఇమేజ్ తో సినిమాకు మంచి ప్రశంసలు దక్కే అవకాశం లేకపోలేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది


Click it and Unblock the Notifications











