బాలకృష్ణదే ఆ రికార్డు...నిజంగానే 'లెజెండ్‌' (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : తెలుగు సినిమా రోజులు లెక్క పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు వారాలు గట్టిగా ఆడితే మంచి హిట్ క్రింద లెక్కేసే పరిస్ధితి వచ్చేసింది. కేవలం కలెక్షన్స్ ని బట్టే హిట్ రేంజిని అంచనా వేస్తున్నారు. గతంలోలాగ యాభై రోజులు, వంద రోజులు అనేవి లేకుండా పోయిందే. అయితే బాలకృష్ణ ఆ రికార్డుని బ్రద్దలు కొట్టి కొత్త రికార్జుని క్రియేట్ చేసారు. సోమవారంతో 'లెజెండ్‌' 200 రోజులు పూర్తిచేసుకొంది.

బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్‌' 200 రోజులు ప్రదర్శితమైంది. ఇటీవల కాలంలో ఆ ఘనతను సాధించిన సినిమా ఇదే. కర్నూలు జిల్లాలోని ఓ థియేటర్‌లో 'లెజెండ్‌' విడుదలైనప్పట్నుంచి నిరాటంకంగా ప్రదర్శితమవుతోంది. దాంతో ప్రత్యేకమైన టీజర్ ని వదిలారు.

https://www.facebook.com/video.php?v=710659495676396&set=vb.227725507303133&type=2&theater

అంతేకాదు ...బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఆ ఘనత సాధించిన ఐదో సినిమాగా 'లెజెండ్‌' రికార్డు సృష్టించింది. ఇదివరకు 'మంగమ్మగారి మనవడు', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'సింహా' చిత్రాలు ఆ ఘనతని సాధించిన వాటిలో ఉన్నాయి. సోమవారంతో 'లెజెండ్‌' 200 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ త్వరలో ఓ వేడుకని నిర్వహించనుంది.

నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

Balakrishna Legend 200 days in Kurnool

2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోయాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది.

ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X