గోపీచంద్ ఫ్లాపు సినిమా అంతలా నచ్చేసిందా బాలకృష్ణా?
బాలయ్య బాబు 'ఆంధ్రుడు సినిమా చూసి...ఆ సినిమాకి పనిచేసిన టీమ్‌నే ఈ సినిమాకూ తీసుకోండి' అంటూ దర్శుకుడు పరుచూరి మురళి ఆనందోత్సాహాల మధ్య చెప్పుకొచ్చారు. గోపీచంద్ హీరోగా చేసిన ఆంద్రుడు సినిమా టైటిల్ లో తప్ప మరెక్కడా విషయం లేదని అప్పట్లో అంతా రిజెక్టు చేసారు. ఇదే విషయాన్ని దర్శకుడు కూడా ఒప్పుకుంటూ..ఇది వరకు 'ఆంధ్రుడు' అనే సినిమా తీశా. 'అనవసరంగా ఆ సినిమా తీశా..' అనుకునేవాడ్ని. కానీ ఇప్పడు బాలయ్య మాటలు వింటుంటే ఆనందంగా ఉంది..మా కష్టం వృథా కాలేదు అనిపించింది అన్నారు. ఇంతకీ బాలకృష్ణకు ఈ ఆంద్రుడు చిత్రంలో ఏమి నచ్చిందో అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే పెద్ద హీరోని ఎలా డీల్ చేసాడో బాలయ్య చూసి జడ్జిమెంట్ ని చెప్పారని కొందరంటున్నారు. ఏదైమైనా మంచి కథకుడు పేరు పొందిన పూరీ జగన్ కథని రిజెక్టు చేసిన బాలకృష్ణ ..ఇలా ఆంద్రుడు చిత్రం చూసి ఆ దర్శకుడుకి అవకాశమివ్వటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ఈ షూటింగ్ ను ఆరంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం' అని చెప్తున్నారు నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి. ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.


Click it and Unblock the Notifications











