బాలయ్యకు ప్రియమణి అంటే
బాలకృష్ణకు ప్రియమణి పిచ్చపిచ్చగా నచ్చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఆమెను తర్వాత సినిమాకు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారని యూనిట్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మిత్రుడు సినిమా నిమిత్తం ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రియమణి డాన్సుల్లో స్టెప్స్ చూసి బాలయ్య పదే పదే మెచ్చుకునే వారని, ఆమె కూడా బాలయ్య డైలాగ్ డెలివరీకి ఎమోషన్స్ పండించటంలో ఉన్న నేర్పుకి సలామ్ కొట్టేదని తెలుస్తోంది.
ఇక మొదట బాలయ్య..ప్రియమణి పై పెద్దగా ఆసక్తి చూపలేదని..కానీ ఆమె ఇన్వాల్ మెంట్ ను సెట్ లో చూసిన తర్వాత దర్శక, నిర్మాతలను అభినందించారని సమాచారం. ఇక ప్రియమణి ఇంతకుముందు నందమూరి వారసులు ఎన్టీఆర్ తో యమదొంగ,కళ్యాణ్ రామ్ తో హరే రామ్ చేసింది. ఈ సినిమాతో ఆమె నందమూరి కుటుంబంతో హ్యాట్రిక్ కొట్టింది. అలాగే బాలయ్య స్పీడు చూస్తుంటే ఆమెతో మరో రెండు చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టేటట్టు ఉన్నారు. ఇక ప్రియమణి తాజాగా ద్రోణ చిత్రంలో బికినీ వేసుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











