సింహాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారు
నటనపరంగా, లుక్స్‌పరంగా ఒక ఒక కొత్త బాలకృష్ణను సింహా సినిమాలో చూస్తారు. సినిమాలో మంచి యాక్షన్ కూడా ఉంది. ఫైట్లు కొత్త పద్దతిలో ఉంటాయి. ఇది నాకు హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను అంటున్నాడు సింహా దర్శకుడు బోయపాటి శ్రీను. నందమూరి బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న 'సింహా' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంతో సాగుతోంది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం పోగ్రస్ గురించి మీడియా మీట్ పెట్టారు.
అలాగే సింహా సినిమా ఫస్టాఫ్ లో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం సెకెండాఫ్ లో వచ్చే సీన్లు చిత్రీకరిస్తున్నామని బోయపాటి శీను తెలిపారు. చిత్రంలో మరో హీరోయిన్ నటిస్తున్న నయనతార పాల్గొన్న సన్నివేశాలను తీస్తున్నామని, సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర అని ఆయన అన్నారు. కథ డిమాండ్ మేరకు ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత పోషిస్తున్న ఈ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు.
చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ 'పెద్ద సినిమా అనగానే మొదట కంగారు పడ్డాను. అయితే బాలయ్యబాబు సహకారంతో, మా దర్శకుడు ప్లానింగ్‌తో అనుకున్నది అనుకున్నట్లుగా వర్క్ జరుగుతోంది. జనవరి 12 వరకూ వైజాగ్, బొబ్బిలి, విజయనగరం, వరంగల్, మెదక్‌లలో జరిగే షూటింగ్‌తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. వేసవికి సినిమాను విడుదల చేస్తాం. నేను ఇంతకుముందు తీసిన సినిమాలకంటే చాలా ముందుకెళ్లి తీస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
బాలకృష్ణ, నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత, కె.ఆర్.విజయ, కిన్నెర, సన, ఝాన్సీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, కృష్ణభగవాన్, వేణుమాధవ్, ఎల్.బి.శ్రీరామ్, సాయికుమార్ (మలయాళ నటుడు), హేమంత్, శ్రావణ్, జీవి, ఆనంద్, దిల్ రమేష్, ఆనందభారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్ధర్ ఎ.విల్సన్, సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.మహేంద్రబాబు, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











