బడిపంతులు అంటూంటే బాలకృష్ణ హ్యాపీ
బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు కోసం ముసలి గెటప్ లో ఓ స్టిల్ ని ఫస్ట్ లుక్ గా విడుదల చేసారు. అది చూసిన వారంతా అప్పట్లో ఎన్టీఆర్ చేసిన బడిపంతులు చిత్రంలో ఎన్ఠీఆర్ గుర్తు వస్తోందంటున్నారు. ఆ స్టిల్ టాపిక్ వచ్చినప్పుడల్లా బడిపంతులు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం బాలకృష్ణకు చాలా ఆనందాన్ని కలగచేస్తోందని తెలుస్తోంది. తన తండ్రిని ఎంతోగానో గౌరవించి,ప్రేమించే బాలకృష్ణ అలా తన గెటప్ అనుకోకండా తన తండ్రిని గుర్తు చేయటం ఓ అద్బుతంగా ఫీలవుతున్నారు. ఇక ఈ స్టిల్ చూసినవారంతా బాలకృష్ణ ఎటువంటి గెటప్ లో అయినా ఇమిడిపోగలవాడని మరోసారి నిరూపించాడని మెచ్చుకుంటున్నారు.'అధినాయకుడు" చిత్రాన్ని కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చా యని అంటున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం ఆడియో విడుదల కాబోతుందని వినికిడి. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా 'అధినాయకుడు" రాబోతోంది.
దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... “ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమాని కీర్తి కంబైన్స్ పతాకం పై ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు . ఈ అధినాయకుడు శ్రీరామరాజ్యం విడుదల అయిన రెండు నెలల గ్యాప్ లోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. కర్నూలు లో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అంటే శ్రీరామరాజ్యం రిలీజ్ కాకముందే అధినాయకుడు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు ముస్తాబు అవుతుంది. బాలకృష్ణ్ణ లేటెస్ట్ మూవీ శ్రీరామరాజ్యం నవంబర్ 10న రిలీజ్ అవుతుండగా.. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయుడు" షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











