బాలయ్య ‘మహదేవనాయుడు’ వచ్చే సంవత్సరానికే
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శక్వంలో కూపొందుతున్న 'మహదేవనాయుడు" చిత్రం సంక్రాంతి పండుగ రోజు అంచే జనవరి 12, 2012 న విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించారు. పాటలు మినహా చిత్రం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాను సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనేది బాలయ్య అభిమానుల కోరిక అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ఛార్మి, లక్ష్మీ రాయ్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు పరుచూరి మురళి మాత్రం బాలకృష్ణను ఓ కొత్త డైమెన్సన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇంతకుముందు బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ల కంటే విభిన్నంగా వుండే ఈ క్యారెక్టర్ తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని బాలయ్య కూడా నమ్ముతున్నాడు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు పాత్రలు చేస్తున్నారు. సింహా వంటి సూపర్ హిట్ ని మరోసారి ఇవ్వాలని బాలయ్య భావిస్తున్నారు. దర్శకుడు పరుచూరి మురళి గతంలో గోపిచంద్ తో చేసిన ఆంధ్రుడు హిట్ చూసి బాలకృష్ణ ఈ చిత్రం ఆఫర్ ఇచ్చారు.కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ సి.కుమార్ కెమెరా అందిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.ఇక క్రితం సంక్రాంతికి బాలకృష్ణ పరమ వీర చక్ర చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











