బాలకృష్ణ ‘మహదేవనాయుడు’ చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...

By Srikanya

బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శక్వంలో కూపొందుతున్న 'మహదేవనాయుడు" చిత్రం దశరా పండుగ రోజు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే రోజున పవన్ కల్యాణ్ షాడో చిత్రం,సిద్దార్ద ఓ మై ప్రెండ్ చిత్రం కూడా విడుదల చేస్తున్నారు. పాటలు మినహా చిత్రం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాను పండగకు రిలీజ్ చేయాలనేది బాలయ్య అభిమానుల కోరిక అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ఛార్మి, లక్ష్మీ రాయ్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు పరుచూరి మురళి మాత్రం బాలకృష్ణను ఓ కొత్త డైమెన్సన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ల కంటే విభిన్నంగా వుండే ఈ క్యారెక్టర్ తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని బాలయ్య కూడా నమ్ముతున్నాడు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు పాత్రలు చేస్తున్నారు. సింహా వంటి సూపర్ హిట్ ని మరోసారి ఇవ్వాలని బాలయ్య భావిస్తున్నారు. దర్శకుడు పరుచూరి మురళి గతంలో గోపిచంద్ తో చేసిన ఆంధ్రుడు హిట్ చూసి బాలకృష్ణ ఈ చిత్రం ఆఫర్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X