'ఊ.. కొడతారా!?'చిత్రం ఎందుకు ఒప్పుకున్నానంటే...బాలకృష్ణ

By Srikanya

ప్రజలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు.వారి అభిరుచికి అనుగుణంగానే సినిమాలు నిర్మించాలి. నాకు వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. అందులో భాగంగానే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా అన్నారు బాలకృష్ణ. మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించే చిత్రం 'ఊ... కొడతారా..!? ఉలిక్కిపడతారా..!?'చిత్రం మొదలైంది.నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం శేఖర్ రాజా. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే నాకు బాగా నచ్చిన సినిమా ఇది. టైటిల్‌లో కూడా చాలా కొత్తదనం ఉంది. మీరే ఈ సినిమాను తెరపై చూస్తారు. నూతన దర్శకుడు శేఖర్ రాజా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. మూడేళ్లుగా మనోజ్ పడిన తపన కార్యరూపం దాలుస్తోంది. ఇందులో నేనూ భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమాను సమష్టిగా తీయడానికి అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

ఇది మా సొంత బ్యానర్‌లాంటిది. లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా 'మంచు ఎంటర్‌టైన్‌మెంట్' పతాకం స్థాపించడం ఆనందంగా ఉంది. ఆమె ఎంతో పట్టుదల ఉన్న వ్యక్తి. చలన చిత్ర నిర్మాణరంగంపై బాగా అవగాహన ఉంది. మోహన్‌బాబు కూతురుగా కాకుండా సొంతంగా తనకంటూ ఓ ఇమేజ్ ఉండాలనుకొనే లక్ష్మీ ప్రసన్న...తప్పకుండా నిర్మాతగా కూడా రాణిస్తుంది. ఎంతో సాహసంతో ఈ ప్రాజెక్టు చేయడానికి ఆమె సంకల్పించారు.

1982లో 'శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్' బ్యానర్‌ని స్వర్గీయ ఎన్టీ రామారావు కొబ్బరికాయకొట్టగా... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాప్‌కొట్టి ప్రారంభించారు. ఇదే బ్యానర్‌లో నిర్మించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో నాన్న నటించారు. 'శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ స్థాపించిన పదేళ్లకు నాన్న ఆ బ్యానర్‌లో నటించగా... 'మంచు ఎంటర్‌టైన్‌మెంట్' పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రంలోనే నేను నటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X