చిరుకు బాలయ్య చెక్?

ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రజా రాజ్యం పార్టీ వ్యవహారాలు చర్చకు వచ్చాయని సమాచారం. తెలంగాణ, రాయలసీమల్లో ఆ పార్టీ బలహీనంగా ఉందని, గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో కొంతవరకు పట్టుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆయా జిల్లాల్లోని ముఖ్యనేతలతో బాలయ్య మాట్లాడితే వారిలో నూతనోత్సాహం వస్తుందని చంద్రబాబు సూచించారు. షూటింగ్ సమయంలో అందరూ వస్తే ఇబ్బందులు ఎదురవుతాయాని.. అందువల్ల పగలు షూటింగ్, సాయంత్రం వేళల్లో భేటీలుజరుపుతానని బాలయ్య చెప్పినట్లు తెలిసింది.
బాలయ్య తొలివిడతగా అక్కడి నేతలతో సమాలోచనలు జరిపి పార్టీ పరిస్థితిని పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకుంటారు. తర్వాత ఆయా జిల్లాల్లో తన ప్రచార సరళి ఎలా ఉండాలన్న దానిపై దృష్టిపెట్టనున్నారు. ఇక బాలయ్య.. సోమవారం చంద్రబాబు ఇంటికి పంచెకట్టుతో వచ్చారు. ఎప్పుడూ ఫ్యాంటుతో వచ్చే బాలయ్య పంచెకట్టుతో రావడం చూసిన చంద్రబాబు.. డ్రెస్ బాగుందని కితాబిచ్చారని సమాచారం. మొత్తానికి చిరంజీవికి చెక్ చెప్పటానికి బాలయ్య రెడీ అవటంతో రెండు పార్టీల్లోనూ ఇదో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











