బాలయ్య విజృంభణ

మిత్రుడు చిత్రం కథంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం లో ఉంది. రాజేంద్రప్రసాద్ రాంబంటు చిత్రాన్ని పోలి ఉండేటట్లుగా హీరోయిన్ ప్రియమణికి ఈ చిత్రంలో జాతకం ప్రకారం ఓ సమస్య ఉంటుంది. ఆమెను పెళ్ళి చేసుకునే వాడు అకాల మరణం చెందుతాడు. దాంతో ఆమె దానినుంచి తప్పించుకునేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. ముందు వెనుక లేని ఓ వ్యక్తిని ప్రేమించి, పెళ్ళాడి అనంతంరం అతనికి విడాకులు ఇచ్చి(మరణిస్తే సరేసరి)తనకు నచ్చిన సంభందం సెట్ చేసుకుందామని నిర్ణయం చేసుకుంటుంది. అలా ట్రాప్ చేయబడ్డ వ్యక్తి మన బాలయ్య. అయితే అతనితో నిజంగానే ప్రేమలో పడిపోతుంది. అప్పుడేం జర్గుతుందనేది మిగతా కథ అంటున్నారు. ఇలా ఫన్ తో ఫ్యామిలీలలకు నచ్చే సెంటిమెంట్ తో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. ఇక ఈ కథ నిజమా కాదా అన్నది తేలాలంటే రిలీజయ్యే దాకా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











