బాలకృష్ణ, ప్రియమణి కాంబినేషన్ లో మహదేవన్ రూపొందిస్తున్న మిత్రుడు చిత్రం ఆడియో ఈ నెల నాలుగవ తేదీన జరగనుంది. మొదట రెండవ తేదీన ఫిక్స చేసారు కానీ బాలయ్య డేట్స్ సర్దుబాటు కాక నాలుగుకు మార్చారు. ఎస్.కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మహదేవన్ ...ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.లహరి ఆడియో వారు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు.