మీసాలు తీయనున్న ఒక్క మగాడు!!!
నందమూరి బాలకృష్ణ ఇపుడు ఒక్క మగాడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ చిత్రాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలకృష్ణ కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందనున్న రంగా పాండురంగా సినిమాలో నటించనున్నాడు. రంగా పాండురంగాలో బాలకృష్ణ, శ్రీకృష్ణుని వేశంలో కనిపించనున్నాడు. ఇందుకోసం బాలకృష్ణ తన మీసాలను తొలగించాల్సి ఉంది. రంగా పాండురంగా సినిమా విజయదశిమి రోజుల పూజా కార్యక్రమాన్ని జరుపుకోనున్నది. ఆ రోజే లార్డ్ కృష్ణాకు సంబంధించి బాలకృష్ణపై ఫోటో షూట్ జరపనున్నారు.


Click it and Unblock the Notifications











