బాలయ్య అభిమానులకు మే 28 పండుగ రోజు కానుంది.దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రెడీ అవుతున్న పాండురంగడు అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.ఇందులో బాలకృష్ణ కృష్ణుడు గానూ,భక్తుడు పాండురంగడు గా పించనున్నారు.రామోజీ ఫిలిం సిటి,రాయచూరు,ధాయలాండ్,ఇండోనేషియా,కంబోడియా లలో రమణీయంగా సన్నివేశాలు చిత్రీకరించారు.ఎప్పటిలానే రచయిత జె.కె.భారవి ఈ పౌరాణికానికి కొత్త సొగసులు అద్దారంటున్నారు.మరకతమణి కీరవాణి సంగీతం,జయరాం కెమెరా,స్నేహా,టాబు,ప్రియమణి వంటి హీరోయిన్ల అభినయం ప్లస్ అవుతుందంటున్నారు.ఈ క్రేజి ప్రాజెక్టును ఆర్.కె బ్యానర్ పై కె.కృష్ణ మోహన్ నిర్మిస్తున్నారు.