»   » వైజాగ్‌లో బాలకృష్ణ....ప్రయాణానికి సిద్ధమైన ఫ్యాన్స్

వైజాగ్‌లో బాలకృష్ణ....ప్రయాణానికి సిద్ధమైన ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సింహా' వంటి సూపర్ సక్సెస్ అనంతరం నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం(లెజెండ్) నవంబర్ మొదటి వారం నుంచి విశాఖ పట్నంలో జరుగనుంది. బాలయ్య వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియగానే ఆయన్ను చూసేందుకు విశాఖతో పాటు, చుట్టుపక్కల జిల్లాల నుంచి అభిమానులు వైజాగ్ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.

వైజాగ్‌లో షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అందుకు అనుగుణంగా తమ ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాల్లో మాత్రమే కనిపించే అభిమాన హీరోలను నేరుగా చూసే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది. అందుకే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉండే అభిమానులు ఈ చాన్స్ మిస్ చేసుకోదలుచుకోలేదని అంటున్నారు.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, అందుకు బాలకృష్ణ కూడా ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.

English summary
Nandamuri Balakrishna’s starrer ‘Legend’ will be shot in and around Vizag. The production unit is planning to complete the shoot in a single, long schedule and the film will hit the screens in early 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu