నైనిటాల్‌లో బాలకృష్ణ, మీరాజాస్మిన్, జయప్రద
బాలకృష్ణ-పి వాసుల సినిమా నైనిటాల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మీరా జాస్మిన్, స్నేహ, నవనీత్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మండు వేసవిలో నైనిటాల్ షెడ్యూలులో మీరా జాస్మిన్, జయప్రద మాత్రమే బాలకృష్ణ వెంట ఉన్నారు. స్నేహ షెడ్యూలు నైనిటాల్‌లో లేదు. మే 25 వరకు నైనిటాల్‌లో షూటింగ్ జరుగుతుందని నిర్మాత వాకాడ అప్పారావు చెప్పారు. తర్వాతి షెడ్యూలు జూన్ నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సంగీత విధ్వాంసుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జూలైలో ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. కన్నడంలో సంగీత దర్శకుడిగా అగ్రస్ధానానికి చేరుకున్న గురుకిరణ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో ఒకనాటి అగ్ర హీరోయిన్ జయప్రద నటించడం ఒక విశేషం. ఇంకా నరేష్, జయప్రకాష్ రెడ్డి, అలీ, కోవై సర ళ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు తోటపల్లి మధు.


Click it and Unblock the Notifications