'సింహం' మళ్లీ గర్జిస్తుందా?: బాలయ్యతో మరోసారి బోయపాటి.. అన్నీ కుదరితే ఆరోజే..
సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన.. సింహా, లెజెండ్, చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అభిమానులను సంతోషపెట్టేలా తాజాగా తెరపైకి ఓ వార్త వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. బోయపాటి ప్రస్తుతం రాంచరణ్ హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని టాక్.

నిజానికి బాలయ్య వందో సినిమా బోయపాటి దర్శకత్వంలోనే చేయాల్సి ఉండగా అప్పటికే కమిట్ అయిన సినిమాల కారణంగా దాన్ని వదులుకున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా బాలయ్యతో మరోసారి సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అవుతున్నారట బోయపాటి. అన్నీ కుదిరితే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











