జీవి దర్శకత్వంలో బాలకృష్ణ..డిటేల్స్

బాలకృష్ణ,నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' . ఆ చిత్రంలో రోజా కూడా కీలకమైన పాత్రను చేయనుందని తెలుస్తోంది.సినిరమా చివరలో సీతాదేవిని తనలోకి తీసుకునే తల్లి భూదేవిగా రోజా కనిపించనుంది.గతంలో బాలకృష్ణ,రోజా కాంబినేషన్ లో భైరవద్వీపం వంటి ఎన్నో హిట్ చిత్రాలు వచ్చిన సంగితి తెలిసిందే.ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 10 వ తేదిన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.రాముడు గెటప్‌లో బాలకృష్ణ, సీత పాత్రలో నయనతార ఇట్టే ఒదిగిపోయారు. ఇలాగే ఇతర పాత్రల్లో రోజా, శ్రీకాంత్, విందుధారాసింగ్ తదితరులు మెప్పిస్తారు. 80 ఏళ్ళ సినిమా చరిత్రలో ఈ సినిమా తప్పకుండా నిలిచిపోతుంది.
ఎన్టీఆర్‌గారిని రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆరాధించిన ప్రజలు త్వరలో బాలకృష్ణకు రాముడు పాత్రలో నీరాజనాలు పడతారనేది అక్షరసత్యం. రేపటి తరానికి ఈ చిత్రం ఆదర్శం కావాలనే సంకల్పంతో నిర్మించాం అంటున్నారు 'శ్రీరామరాజ్యం' నిర్మాత యలమంచిలి సాయిబాబు. రాముడుగా బాలకృష్ణ, సీతగా నయనతార నటించిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











