»   » నాన్నగారి తర్వాత ఆయనే (బాలయ్య ముందు మాట...)

నాన్నగారి తర్వాత ఆయనే (బాలయ్య ముందు మాట...)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడిగా డా.మోహన్ బాబు 40 వసంతాలను పూర్తి చేసుకు సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ అన్నింటినీ డైలాగ్ బుక్ రూపంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బుక్ ను మే 11న, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్ లో లాంచ్ చేసారు. ఈ పుస్తకానికి నందమూరి బాలకృష్ణ ముందు మాట రాసారు.

Balayya-MB

బాలకృష్ణ రాసిన ముందు మాట ఇలా....

ఒక వ్యక్తిగా.. నటుడిగా...నాకు మానాన్నగారు స్ఫూర్తి. ఆయన తర్వాత నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మోహన్ బాబుగారే... క్రమశిక్షణతో, ధృడ సంకల్పంతో తనకు అనుకున్న దారిలో ముందుకుసాగి ఇండివిడ్యువల్ గా ప్రత్యేక గుర్తింపు పొందారాయన.

ఆయన డైలాగ్ డిక్షన్ అద్భుతం. సర్దార్ పాపారాయుడు సినిమాలో నాన్నగారితో కలిసి నటించినప్పుడు 'మా వంటవాడు భారతీ..యుడు, మా తోటవాడు భారతీ..యుడు లాంటి డైలాగులు ఎంతో అద్భుతం. నటనలో కావచ్చు...డైలాగ్ డెలివరీలో కావచ్చు...ఎంతో మంది ఆయన్ను అనుకరించి బ్రతికారు కూడా.

నటుడిగా చాలా మంచి సుధీర్ఘమైన ప్రయాణం ఆయనది. ఆయనతో కలిసి నటించే భాగ్యం నాకూ కలిగింది. నేను నటించిన పాండురంగడు సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసారాయన. అటువంటి పాత్రలు స్ట్రేచర్ ఉన్న ఆయనలాంటి నటులు చేస్తేనే చెల్లుతుంది..ప్రేక్షకులకు చేరుతుంది.

ఆయన నవరసాల నటనార్వభౌముడు, ఆయనకంటూ ఒక అద్భుతమైన బాణీని ఏర్పరచుకొని బోలెడన్ని సినిమాలు చేసారు. నను ఈ జన్మలో చేయలేన్ని పాత్రలు చేశారాయన. ఆయన్ని నటుడు నటుడు అంటుంటే ఆయనకు దూరం అవుతున్నామనిపిస్తుంటుంది నాకు. నటుడుగా కంటే ఆయనది మంచి సోదరుడిగా భావిస్తాను. మా కుటుంబ సభ్యులలో ఒకడిగా చూస్తాను. నేను ఇండస్ట్రీలో ఎవరితోనూ అంత సరదాగా ఉండను...ఒక్క మోహన్ బాబు గారితో తప్ప. ఆయన్ని కలుసుకున్నపుడు కలిగే ఆత్మీయతగానీ, వైబ్రేషన్స్ గానీ ఎవరిని కలుసుకున్నా కలగడవు. ఆయన..ఆయన కుటుంబం కూడా నన్నూ అలాగే గౌరవిస్తారు. ఆయన పిల్లలు లక్ష్మీ, విష్ణు, మనోజ్...అన్నయ్యా అంటూ నన్ను ఆత్మీయంగా పిలుస్తారు. అందుకే వారితో కలిసి 'ఊ..కొడతారా ఉలిక్కిపడతారా'లో నటించాను. వారితో వసుదైక కుటుంబం. వారిని అలా పెంచారాయన. వాళ్లు కూడా ఆయన ట్రాక్ లోనే వెళుతూ రాణిస్తున్నారు... నాకు చాలా సంతోషంగా ఉంది.

విలక్షణ నటుడిగా ఆయన చేసిన పాత్రలైతేనేమి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలైతేనేమి.. శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థను పెట్టి 25 శాతం మందికి ఉచిత విద్యనందించడంలోనైతేనేమి...ఆయన మా తరానికీ, తర్వాత తరాలవారికి కూడా ఆదర్శప్రాయుడు. నాకూ ఆయనకు చాలా దగ్గరి పోలికలున్నాయ్. నాకులాగే ఆయనక్కూడా ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశమే ఆయన్ని అభిమానించేలా చేసింది. తననుకున్నది అనుకున్నట్టు జరక్కపోయినప్పుడు...నేననుకున్నది సరైనదారి...ఇదే క్రమశిక్షణ అని నమ్మినప్పుడు ఎదుటివారు దానిని పాటించకపోతే వచ్చే ఆవేశమది.

ఒక నటుడిగా...నిర్మాతగా ప్రజలను రంజింపచేస్తూ పెదరాయుడు లాంటి ఎన్నో ఉదాత్తమైన చిత్రాలలో నటించి...ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చిత్రాలు తీయడం కూడా జరిగింది. ఇండస్ట్రీకి ఇటువంటి వ్యక్తి దొరకడం యవత్తు ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం.

జీవితంలోనూ, ఇండస్ట్రీలోనూ ఎన్నో కష్టనష్టాలను అనుభవించి...వాటిని దాటుకుంటూ ఈదుకుంటూ అధిరోహిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు కాబట్టి....ఆయన వేసే ప్రతి అడుగూ..ప్రతి మాట అనుభవపూర్వకంగా వుంటాయి. గౌరవ డాక్టరేట్ తో పాటు పద్మశ్రీని కూడా సాధించి 40 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆయన..తన సినిమాల్లోని డైలాగులతో 'డైలాగ్ బుక్' లాంచ్ చేస్తున్న సందర్భంగా ముందుమాట రాయడం నాకు గర్వంగా ఉంది. ఆయన ఈ విజయపరంపరని కొనసాగిస్తూ...ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ...

-మీ బాలయ్య
(నందమూరి బాలకృష్ణ)

English summary
Balakrishna Mundu Mata for Mohan Babu's Dialogues Book. Mohan Babu released his book titled "Best Dialogues" at a ceremony held at British Parliament in the presence of senior politicians and prominent Indian community leaders.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu