నాగార్జున-బాలకృష్ణల డ్రీమ్ చుప్కే చుప్కే...!
పెద్ద హీరోలు ఇద్దరు ముగ్గురు కలిసి నటిస్తేనే అది మల్టీ స్టారర్ సినిమా అవుతుంది. ఆ విధంగా త్వరలో తెలుగులో ఓ సినిమా రానుంది. ఇందులో బాలకృష్ణ, నాగార్జున కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి గతంలో హిందీలో నటించిన 'చుప్కే చుప్కే' సినిమా రీమేక్ లో వీరిద్దరూ కలిసి నటిస్తారు. ఈ విషయాన్ని నాగార్జునే వెల్లడించారు.
'ఎప్పటి నుంచే మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఈమధ్య బాలయ్య చుప్కే చుప్కే సినిమా చూడమని డీవీడీ పంపారు. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. త్వరలో ఇద్దరం కూర్చుని మాట్లాడుకోవాలి' అన్నారు నాగ్. ఇదిలా ఉంచితే, జూ ఎన్టీఆర్, నాగ చైతన్య కలిసి నటించే అవకాశం కూడా వుందని నాగ్ చెప్పారు. 'ఇటీవల తారక్ ఫోన్ చేసి... చైతూతో కలిసి 'గుండమ్మ కథ' సినిమాని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. వాళ్ల ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నాను"అన్నారు నాగ్.


Click it and Unblock the Notifications











