టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇద్దూరు రాస్కెల్స్...?
పెద్ద హీరోలు ఇద్దరు ముగ్గురు కలిసి నటిస్తేనే అది మల్టీ స్టారర్ సినిమా అవుతుంది. ఆ విధంగా త్వరలో తెలుగులో ఓ సినిమా రానుంది. ఇందులో బాలకృష్ణ, నాగార్జున కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. గతంలో ఎన్టీఆర్, నాగేశ్వరరావులు కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే వారి నటవారసత్వంలో వచ్చిన రెండోతరం నటులు బాలకృష్ణ, నాగార్జున. వీరిద్దరు కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి గత కొద్ది కాలంగా అనుకుంటున్నారు. అయితే ఇటీవలే బాలకృష్ణ హిందీలో తెరెకెక్కిన 'చుఫ్ చుప్ కే" చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కు ఇద్దరూ కూడా ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు.
అయితే తాజాగా సంజయ్ దత్, అజయ్ దేవగన్ నటించిన 'రాస్కెల్స్" చిత్రంలోని వీరి పాత్రలు నాగ్ కు బాగా నచ్చిందట. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని, ఈ రీమేక్ లో బాలయ్యతో నటించాలని నాగ్ చాలా ఆశగా ఉన్నాడంట. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో చూడాలి. మరి నాగార్జున, బాలకృష్ణ లు కూడా ఒప్పుకుంటే ఇక తెలుగు ప్రేక్షకులకు పెద్ద కనువిందే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











