Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్నికల వేళ మోక్షజ్ఞతో బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!
నందమూరి నటసింహం బాలయ్య వరుసగా రెండవసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్నాయి. ఇప్పటికే ఓటర్లు, సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మరో మారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల వేళ
ఎన్నికల హడావిడిలో అంతా బిజీగా ఉన్న సమయంలో నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ వరుసగా రెండవసారి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో బాలయ్య సతీమణి, కుమార్తెలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మోక్షజ్ఞ ప్రత్యక్షంగా ఎలక్షన్ క్యాపైనింగ్ చేయలేదు కానీ తండ్రి వెంట తిరుగుతున్నాడు.
ఆలయంలో పూజలు
ఎన్నికల్లో విజయం సాధించాలని బాలయ్య కుటుంబ సభ్యులు ఇటీవల ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా బాలయ్య, మోక్షజ్ఞ కలసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. బాలయ్య, మోక్షజ్ఞ దేవుడి ఫొటోతో ఫోజు ఇస్తున్నారు. బాలయ్య సతీమణి వసుంధర కూడా ఈ ఫొటోలో ఉన్నారు. మోక్షజ్ఞ కళ్ళజోడు ధరించి కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ లుక్ డీసెంట్ గా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
టాలీవుడ్ ఎంట్రీ కోసం
నందమూరి అభిమానులు ఎప్పటినుంచో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత బాలయ్య, బాలయ్య తర్వాత జూ ఎన్టీఆర్ నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా రెడీ అవుతన్నాడు అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో ప్రావీణ్యం పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ప్రకటిస్తారా
బోయపాటి శ్రీను, క్రిష్ జాగర్లమూడి లాంటి దర్శకులతో మోక్షజ్ఞ తొలి చిత్రం ఊహాగానాలు సైతం వినిపించాయి. కానీ బాలయ్య నోటినుంచి మోక్షజ్ఞ తొలి చిత్రానికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. తన తనయుడి తొలి సినిమా ప్రకటనని బాలయ్య ఈ ఏడాదే చేస్తారా లేక ఇంకా వాయిదా వేస్తారా అనేది తేలాలి. ఎన్నికల తర్వాత బాలయ్య బోయపాటి దర్శత్వంలో నటించనున్నారు.