బాలయ్య సినిమా 'సీన్ టు సీన్' కాపీనా?

శుభకార్యం పేరుతో రాజశేఖర్ హీరోగా రవిరాజా పినిసిట్టి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభించానని దాదాపు అరవై శాతం పూర్తయ్యాక ఈ కాపి విషయం బయిటపడింది. ఆ విషయాన్ని చెన్నై నుంచి నరసింహనాయుడు ప్రివ్యూ చూసిన ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి చెప్పటంతో బయిటపడిందని చెప్పుకొచ్చారు.ఆ వార్త వినగానే ఆయనకు గుండె ఆగినంత పనైందని ఆవేదనతో చెప్పారు. ఇక మొదట్లో ఆ విషయం నమ్మక ఏవో ఒకటి రెండు సీన్స్ పోలిక ఉంటాయోమో అనుకున్నారుట.
అయితే తెల్లారి నరసింహనాయుడు రిలీజ్ కి మార్నింగ్ షొ వెళ్ళి చూసారు.కానీ ఎడిటర్ మోహన్ గారు చెప్పినట్లు సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ శుభకార్యం కథకు ట్రూ కాపీ. ఆ రోజున ఆ దియోటర్లో ఆయనతో పాటు సినిమా చూస్తున్న వేలాది ప్రేక్షకులు ఈలలు,టప్పట్లుతో ఎంజాయ్ చేస్తూంటే ఆయన ఒక్కడి మనసు రగిలిపోయిందని చెప్పుకొచ్చారు. అసహనం,అసహ్యం,కోపంతో కుతకుతలాడిందని ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఏం చేయాలో ఎవర్ని అడగాలో అర్ధం కాని స్ధితిలో దర్శకుడు బి.గోపాల్ కి ఫోన్ చేసి ఇలా చేశారేంటని అడిగారు.
దానికి గోపాల్ చాలా సౌమ్యంగా నాకు నిజంగా ఏ జరిగిందీ తెలియదు...చిన్ని కృష్ణ మంచి కథ చెప్పాడు. బాగుందనిపించింది. బాలయ్యబాబుకు చెప్తే ఆయనకూ నచ్చింది. వెంటనే మొదలు పెట్టాం అన్నారు. అప్పుడు ఆయనకు అసలు ఇదంతా ఎలా జరిగిందో గుర్తుకు వచ్చింది.అప్పట్లో కళ్యాణ్ తో పాటు చిన్ని కృష్ణ కూడా అయ్యప్ప మాల వేసుకుని శబర్ మలై వెళ్ళారు. ఆయన ఆనందపుంగాట్రై రైట్స్ తీసుకునేటప్పుడు అతను కూడా ఆ సినిమా చూసాడు. ఆ తరవాత ఉన్నట్టుండి మాయమయ్యారు.
ఏమోలే అనుకుని ఆయన శుభకార్యం షూటింగ్ ప్రారంభించారు. ఆ క్షణంలో ఆయనకు రైటర్ చిన్నికృష్ణ మీద ఛాంభర్ లో కేసు వెయ్యాలని ప్రిపేర్ అయ్యారు. అయితే దాని వల్ల ఆయన,ఆయన సినిమా అల్లరవటం తప్ప ప్రయోజనం లేదు. అంతేగాక అప్పటికే లక్షల్లో ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్సియర్స్ కీ విషయం తెలిస్తే గగ్గోలు పెడతారు. అలా ఆ గొడవను పెద్దది చేయకుండా ఆపారు. ఆ తర్వాత పలు మార్పులతో ...నరసింహనాయుడు కి పోలిక రాకుండా ఉండటం కోసం చేసి సినిమా రిలీజ్ చేసి దెబ్బ తిన్నారని చెప్పుకొచ్చారు.ఇదీ పరిశ్రమలో పేరున్న ఒక నిర్మాతకి జరిగిన భయంకర చేదు అనుభవం.
ఇక ఒరిజనల్ ఆనంద పుంగాట్రై లో అజిత్ హీరోగా చేసాడు. మీనా,కార్తీక్,మాళవిక మిగతా పాత్రల్లో చేసారు.ఇక ఈ చిత్రాన్ని రాజ్ కపూర్ అనే దర్శకుడు డైరక్ట్ చేసాడు. అక్కడా సంగీతం మాస్టర్ గా వచ్చిన హీరోతో మీనా ప్రేమలో పడటంతో సినీ ప్రారంభం అవుతుంది. శుభకార్యంలో ఈ పాత్రను రాజశేఖర్ చేస్తున్నారని తరువాత దాన్ని పోలీస్ గా మార్చారు.


Click it and Unblock the Notifications











