NBK108: బాలయ్య ఫ్యాన్స్‌కు వరుసగా అదిరిపోయే అప్డేట్స్.. బర్త్‌డేకు టైటిల్‌కు మించిన సర్‌ప్రైజ్!
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి వయుసులో అయినా సూపర్ ఎనర్జీతో పర్ఫామెన్స్ ఇస్తుంటారు. అలాగే యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు వేసుకున్న బాలయ్య బాబు తాజాగా నటించిన 108వ చిత్రం NBK108. కామెడీ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రానుంది. అది కూడా బాలయ్య బాబు పుట్టినరోజు కంటే ముందుగా. అందేంటనే వివరాల్లోకి వెళితే..
నందమూరి నటిసింహం బాలకృష్ణ, కామెడీ చిత్రాలకు పేరు గాంచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపుగా మూవీ షూటింగ్ పూర్తయిందని టాక్ రానుండగా ఈ సినిమాను విజయదశమి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి భారీ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు మేకర్స్. అది మరోదే కాదు NBK108 పవర్ ఫుల్ టైటిల్ ను లాంచ్ చేయనున్నారు. అయితే అది బాలకృష్ణ పుట్టినరోజు అయిన జూన్ 10న కాదు. ఇప్పటివరకు బాలయ్య బాబు బర్త్ డే సందర్బంగా NBK108 టైటిల్ అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ నందమూరి అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ కింద బాలయ్య పుట్టినరోజుకు రెండు రోజుల ముందుగానే టైటిల్ ప్రకటించనున్నారు.
అంటే జూన్ 8న NBK108 టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి డబుల్ ట్రీట్ అందించనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపారు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కాబట్టి రెండు రోజుల ముందు నుంచే వేడుకలు నిర్వహిస్తూ అభిమానులను సంతోషపెట్టనున్నారట. అంతేకాకుండా జూన్ 10న వీటన్నింటికి మించి అతి భారీ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేశారట మేకర్స్. సో బాలయ్య బర్త్ డే పూర్తయ్యేలోపు అభిమానులు వరుసగా సర్ ప్రైజ్ కు గురి కానున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే NBK108 సినిమాకు భగవత్ కేసరి టైటిల్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. మరి ఈ టైటిలే అనౌన్స్ చేస్తారా.. ఇంకైదైనా ఉంటుందా అనేది వేచి చూడాలి. కాగా ఇందులో బాలకృష్ణకు జోడిగా చందమామ కాజల్ చేయగా శ్రీలీల కీలక పాత్ర పోషించనుంది. ఇక పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











