Bhagavanth Kesari: మొదలైన బాలయ్య బర్త్ డే వేడుకలు.. టైటిల్ రిలీజ్.. ఇగ మాస్ ఊచకోత!

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి వయుసులో అయినా సూపర్ ఎనర్జీతో పర్ఫామెన్స్ ఇస్తుంటారు. అలాగే యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు వేసుకున్న బాలయ్య బాబు తాజాగా నటించిన 108వ చిత్రం NBK108. కామెడీ అండ్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి అధికారికంగా టైటిల్ అనౌన్స్ చేశారు.

బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపుగా మూవీ షూటింగ్ పూర్తయిందని టాక్ రానుండగా ఈ సినిమాను విజయదశమి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇదివరకే నిర్మాతలు ప్రకటించారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Balakrishna NBK 108 Title As Bhagavanth Kesari And Poster Released

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి భారీ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు గత కొద్ది రోజులుగా మేకర్స్ చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్బంగా వేడుకలను రెండు రోజుల ముందుగానే మొదలు పెట్టారు. జూన్ 8న అంటే ఇవాళ NBK108 మూవీ టైటిల్ ఏంటో అనౌన్స్ చేసిన నిర్మాతలు అధికారికంగా రివీల్ చేసేశారు. బాలకృష్ణ 108వ సినిమాకు 'భగవంత్ కేసరి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లుగా ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే టైటిల్ ఫిక్స్ అయింది.

అంతా అనుకున్నట్లుగానే NBK108 మూవీకి 'భగవంత్ కేసరి' అని టైటిల్ ఖరారు చేసినట్లుగా ప్రకటించారు. 'ఐ డోంట్ కేర్' అనేది ఉప శీర్షిక. దానికి సంబంధించిన రిలీజ్ చేసిన పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ పోస్టర్ కు అన్న దిగిండు.. ఇక మాస్ ఊచకోత షురూ.. అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక పోస్టర్ లో చేతిలో ఉన్న ఖడ్గాన్ని నేలపై ఉంచి బాలయ్య ఇచ్చిన పోజు అదిరిపోయింది. అలాగే బాలయ్య చుట్టు ఉన్న ప్లేస్, బ్యాక్ గ్రాఫ్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 108 లొకేషన్లలో ఈ మూవీ టైటిల్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా చేయగా.. శ్రీలీల మరో హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X