బాలయ్య కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు!
నందమూరి బాలకృష్ణ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయబోవడం ఖాయం. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ 'జై సింహా' 100 రోజుల వేడుకలో ప్రకటించడం జరిగింది. అంతేకాదు మే లో ఈ సినిమా ప్రరంబహం కానుందని నిర్మాత చెప్పడం జరిగింది.
గతంలో బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో సి.కళ్యాణ్ 'పరమవీరచక్ర' చిత్రం నిర్మించారు. ఆ సినిమా 2011 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్ళి అదే డేట్ కు జై సింహ విడుదలై మంచి విజయం సాధించడం జరిగింది.

బాలయ్య బాబుతో సి.కళ్యాణ్ చెయ్యబోయే ముడోసినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. మే 2న ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











