పుట్టిన రోజున బాలయ్య చిత్రం ప్రారంభం, కాబోయే సిఎం అంటూ నినాదాలు
యువరత్న నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం హరహర మహాదేవ చిత్రం శుక్రవారం హైదరాబాదులోని హైటెక్స్‌లో ప్రారంభోత్సవం జరిగింది. శుక్రవారం బాలయ్య 52వ పుట్టిన రోజు జరుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజునే ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి సమరసింహారెడ్డి, ఆది, ఇంద్ర వంటి హిట్‌లు ఇచ్చిన బి.గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా అభిమానులు హల్ చల్ చేశారు. కాబోయే ముఖ్యమంత్రి బాలయ్య అంటూ నినాదాలు చేశారు. కాగా ఈ ప్రారంభోత్సవానికి నందమూరి కళ్యాణ్ రామ్, తారకతర్న హాజరయ్యారు.
కాగా ఇప్పటికే బాలయ్య శ్రీరామరాజ్యం చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో కూడా ఆయన ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారంట. గత ఏడాది సింహాతో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న బాలయ్య శ్రీరామరాజ్యంపై మంచి విశ్వాసంతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











