‘లెజెండ్’ వేడి తగ్గక ముందే బాలయ్య మరో చిత్రం (ఫోటోలు)
హైదరాబాద్: 'లెజెండ్' చిత్రంతో హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ తర్వాతి సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త రుద్రపాటి రమణారావు 'ఎస్ఎల్‌వి సినిమా' బేనర్లో నిర్మించబోతున్నారు. ప్రొడక్షన్ నెం.3గా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి యువ దర్శకుడు సత్యదేవ దర్శకత్వం వహించబోతున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెస్ నోట్లో మే నెలలో చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, హైటెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత ప్రకటనలో పేర్కొన్నారు.
లెజెండ్ సినిమా వివరాల్లోకి వెళితే ఈ నెల 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు నుండే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. బాలయ్య కెరీక్లో ఈచిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 50 కోట్ల మార్కును అందుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
లెజెండ్ చిత్రానికి 'సింహా' ఫేం బయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సింహా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అనగానే అంచనాలకు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా కమర్షియల్ మసాలా బాగా దట్టించి సక్సెస్ కొట్టాడు బోయపాటి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సయుక్తంగా నిర్మించాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

బాలకృష్ణ
‘లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో బాలకృష్ణ కొత్త సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎన్నికల తర్వాత
ఏప్రిల్ 30న జరిగే ఎన్నికల్లో బాలయ్య అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే కొత్త చిత్రం ప్రారంభోత్సవం మే నెలలో పెట్టుకున్నారు.

సత్యదేవా
బాలకృష్ణ కొత్త చిత్రానికి యువ దర్శకుడు సత్యదేవ దర్శకత్వం వహించబోతున్నారు.

రుద్రపాటి రమణారవు
ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త రుద్రపాటి రమణారావు ‘ఎస్ఎల్‌వి సినిమా' బేనర్లో నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











