జనవరి 29 నుంచి బాలయ్య కొత్త సినిమా
హీరో బాలకృష్ణ, దర్శకుడు రవి చావలి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. శ్రీరామరాజ్యం సినిమాకు నయన తారను ఎంపిక చేసి హీరోయిన్ల ఎంపికలో తన జడ్జిమెంట్ పర్ ఫెక్ట్ అని నిరూపించిన బాలయ్య...ఈ సినిమాలో కూడా తానే స్వయంగా పార్వతి మెల్టన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్వయంగా బాలయ్య నుంచి ఆఫర్ రావడంతో....అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పార్వతి రొట్టెవిరిగి నేతిలో పడ్డట్లయింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ప్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ చిత్రం బాలయ్య అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య పరుచూరి మురళి దర్శకత్వంలో అధినాయకుడు చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన మూడు విభిన్నమైన పాత్రల్లో త్రిపాత్రాభినయం చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











