twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య,బోయపాటి టైటిల్ అదే?

    By Staff
    |

    బాలయ్య హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రానున్న చిత్రానికి ఓ గమ్మత్తైన టైటిల్ పెట్టనునున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడతోంది. ఆ టైటిల్ "ధనరాజ్" ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ జరిగనట్లు సమాచారం. బోయపాటికి మొదటి నుంచి సినిమాలో హీరోల పేరునే టైటిల్ గా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతకు ముందు భధ్ర,తులసి అలా పెట్టినవే. ఇక బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్లో అనుకున్న చిత్రంకి బ్రేక్ పడటంతో ఈ సినిమా ముందుకొచ్చింది. తులసి తర్వాత బోయపాటి ఒక్క సినిమా కూడా ఓకే చేయించుకోలేకపోయాడు. ఆ మధ్యన మిత్రుడు ముందు బాలయ్యకు ఓ కథ చెప్పాడు కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత గోపీచంద్ తో చేద్దామని జెమినీ సర్కూట్స్ నిర్మాతగా ఆఫీస్ కూడా తెరిచారు కానీ ఫలించలేదు.

    వారు వరుణ్ సందేష్ తో పొల్దాదవాన్ రీమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత నాగార్జున సైతం బోయపాటికి హ్యాండు ఇచ్చి కింగ్ చేసాడు. అయితే బోయపాటి కథపై బాలయ్యకు నమ్మకం ఉండటం వల్లే బోయపాటిని పిలిచారని తెలుస్తోంది. ఇక బి.గోపాల్ కి ఇప్పటికీ కథ సెట్ కాకపోవటమే ఆయనకీ ఈ చిత్రం చేజారిందని వినపడుతోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ఇప్పటికీ పూర్తయిందని, నయనతార హీరోయిన్ గా చేసే అవకాశముందని సమాచారం.ప్రస్తుతం బాలయ్య..తన స్నేహితుడు బెల్లంకొండ నిర్మాతగా రూపొందించనున్న భీష్మ హడావిడిలో ఉన్నారు. దానిని రమేష్ వర్మ డైరక్ట్ చేస్తున్నాడు. రమేష్ వర్మ రీసెంట్ గా తీసిన రైడ్ భాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకోవటంతో ఈ అవకాశం వచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X