బాలకృష్ణ, బి.గోపాల్ కొత్త చిత్రానికి ఆ టైటిల్ నే కన్ఫర్మ్

By Srikanya

"బాలకృష్ణ హీరోగా త్వరలోనే ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం. బి.గోపాల్‌ దర్శకత్వం వహిస్తారు. బాలయ్య అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని ఓ మంచి కథను ఇప్పటికే సిద్ధం చేశాం. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తికాగానే మా చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది అంటున్నారు బెల్లంకొండ సురేష్. బాలకృష్ణ, బి గోపాల్ దర్సకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రానికి "హర హర మహా దేవ" అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న ఈ చిత్రం త్వరలో పట్టాలు ఎక్కనుంది. అలాగే బెల్లంకొండ తన తాజా చిత్రం నాగవల్లి అనంతరం చేయనున్న చిత్రంగా ఈ ప్రాజెక్టుని ప్రొజెక్టు చేస్తున్నారు. ఇక బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో గతంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. దాంతో ఈ కాంబినేషన్ అంటే ఎక్సపెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయని, ఆ మ్యాజిక్ మళ్ళీ జరగాలని బెల్లంకొండ కోరుకుంటున్నారు.

ఇక బి.గోపాల్...మస్కా ఫ్లాఫ్ తర్వాత మరో చిత్రాన్ని డైరక్ట్ చేయలేదు. ఆ మధ్యన గోపీచంద్ తో ఆయన చిత్రం ఓకే అయిందంటూ వార్తలు వచ్చాయి కానీ అది మెటీరియలైజ్ కాదు. ఇక తాను నిర్మించబోయే చిత్రం అద్భుతమైన కథ, అత్యున్నత సాంకేతిక విలువలతో ఉంటుందనీ, బాలకృష్ణ ఇమేజ్ ను పెంచే విధంగా అత్యంత భారీ చిత్రంగా దీనిని రూపొందించనున్నామనీ బెల్లంకొండ చెప్తున్నారు.బాలకృష్ణ ప్రస్తుతం దాసరి నారాయణరావు దర్సకత్వంలో పరమ వీర చక్ర చిత్రం చేస్తున్నారు. అలాగే పరుచూరి మురళి దర్శకత్వంలోనూ మరో చిత్రం ప్రారంభించారు. వీటితో పాటు బాపు దర్సకత్వంలో శ్రీరామ రాజ్యం అనే పౌరాణిక చిత్రం మొదలెట్టి వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X