'పాండురంగడు' విజయోత్సాహంలో ఉన్న బాలకృష్ణ ఇప్పటి వరకూ తర్వాత సినిమా యేమిటన్నటి ప్రకటించలేదు. దాంతో ఆయన అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. అందులోనూ ఈ మధ్య ఆయనతో సినిమా చెయ్యబోతున్నారంటూ దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, గుణశేఖర్, శ్రీవాస్ ల పేర్లు వినిపించాయి. కానీ అవేమీ ఆయన కన్ఫర్మ్ చేయకపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ లోగా మరో దర్శకుడు తెరపైకి వచ్చాడు. రాజమౌళి శిష్యుడైన మహదేవన్ బాలకృష్ణకు కధ వినిపించారని ఆయన దానని ఓ.కె.చేసారని...తెలుస్తోంది. దానికి నిర్మాతగా గతంలో బాలయ్య 'ఆదిత్య 369' నిర్మించిన కృష్ణప్రసాద్ వ్యవహరించనున్నారని ఫిల్మ్ నగర్ భోగట్టా. ఇక బాలయ్య ఆయన బర్తడే అయిన జూన్ 10 వతేదీన తన కొత్త సినిమా ప్రకటన చేస్తారని ఎదురుచూస్తున్నారు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను తన అల్లుడు,కూతురు లతో కలసి అమెరికాలో జరుపుకోనున్నారు.
Story first published: Monday, May 18, 2026, 8:22 [IST]