బాలయ్య కొత్త గెటప్ కేక
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి సంభందించిన గెటప్ అందరికీ నచ్చుతోందని సమచారం. రఫ్ గా కొద్దిగా మీసం మార్చిన ఈ లుక్ అభిమానులందరినీ అలరిస్తోంది. అయితే ఈ గెటప్ అప్పట్లో కమల్, శివాజి గణేషన్ కాంబినేషన్లో వచ్చిన క్షత్రియపుత్రుడు చిత్రం లో శివాజి గెటప్ ని గుర్తు చేస్తోందంటున్నారు. ఇక ఈ గెటప్ లోనే బాలయ్య జోష్ ఆడియోకు అటెండయ్యారు. ఇక ఈ విషయమై బోయపాటి మాట్లాడుతూ గెటప్ బాగుందంటూ అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన లభించటం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ చిత్రానికి ధనరాజ్ అనే టైటిల్ పెట్టినట్లు సైట్స్ లో వచ్చింది. అది నిజం కాదు..టైటిల్ ఇంకా అనుకోలేదు. త్వరలో పూర్తి వివరాలతో మీ ముందుకొస్తాను. బాలయ్య కెరీర్ లో మరో సంచలనాత్మకమైన చిత్రం అవుతుందని మాత్రం చెప్పగలను అన్నారు బోయపాటి. బోయపాటి గతంలో రవితేజ హీరోగా భద్ర, వెంకీ హీరోగా తులసి చిత్రాలు రూపొందించారు. అయితే తులసి చిత్రం పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో గ్యాప్ వచ్చింది.


Click it and Unblock the Notifications











