అభిమానులు డబ్బుతో రారు, సినిమా ప్రారంభోత్సవంలో బాలకృష్ణ వ్యాఖ్య
హైదరాబాద్ : అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలని, అభిమానులను డబ్బు ఎరగా చూపో, లేక ప్రభాలోభపెట్టో సంపాదించుకోలేమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో....బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. జన్మనిచ్చింది తారకరామారావు దంపతులు అయితే, తనను ఇంత వాడిని చేసిందిన అభిమానులే అని, కొందరు ఆశించడానికి పుడతారు, మరికొందరు శాసించడానికి పుడతారు అంటూ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమానికి భారీ అభిమానులు హాజరైన బాలకృష్ణకు జన్మిదిన శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు, పూలమాలలో సత్కరించారు. బాలయ్య జన్మదినం సందర్భంగా పలువురు అభిమానులు రక్తదానం చేసారు. సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు పాల్గొన్నారు.
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సింహా తర్వాత బాలకృష్ణ-బోయపాటి కలయికలో ప్రారంభమైన మరో సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో జరిగింది.

గతంలో వీరిద్దరికాంబినేషన్లో వచ్చిన ‘సింహా' చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానుల అంచనాలకు తగిన విధంగా తాజా చిత్రం తెరకెక్కుతోంది.

రామకృష్ణ స్టూడియోలో జరిగిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి బాలయ్యకు సీన్ వివరిస్తున్న దృశ్యం

ప్రముఖ నిర్మాత బి గోపాల్ రామకృష్ణ స్టూడియోలో జరిగిన కార్యక్రమానికి హాజరైన కెమెరా స్విచాన్ చేసారు.

యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బాలయ్య తాజా సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. బాలయ్య సినిమాకు దేవిశ్రీ పని చేయడం ఇదే తొలిసారి. మాస్ ట్యూన్స్ ఇవ్వడంలో మంచి ప్రావీణ్యం ఉన్న దేవిశ్రీ మరి ఈ సినిమాకు ఏ రేంజిలో ఆడియో అందిస్తారో అనే ఆసక్తి సర్వతా నెలకొంది.

దేవిశ్రీ ప్రసాద్‌కి బాలయ్యతో చనువు ఎక్కువే. అందుకు ఈ దృశ్యమే నిదర్శనం.

బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు రక్తదానం చేసారు.

బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు భారీగా హాజరయ్యారు. అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలని, అభిమానులను డబ్బు ఎరగా చూపో, లేక ప్రభాలోభపెట్టో సంపాదించుకోలేమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











