బాలకృష్ణ సినిమా టైటిల్ ‘ఎన్‌బికె లయన్’
హైదరాబాద్: బాలయ్య ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ పరిశీలించారు. తొలుత ‘గాడ్సే' అనే టైటిల్ అనుకున్నప్పటికీ అది బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా లేక పోవడంతో ‘వారియర్' అనే టైటిల్ పరిశీలించారు. ఇది కూడా సెట్ కాక పోవడంతో బాలయ్య సింహా సెంటిమెంట్ కలిసొస్తుందని ‘లయన్' ఫైనల్ చేసే ఆలోచనకు వచ్చారు. తాజాగా ఈ టైటిల్ ‘ఎన్‌బికె లయన్' అని మార్చినట్లు సమాచారం. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
తాజాగా క్రిస్ మస్ పండగను పురస్కరించుకుని బాలయ్యకు సంబంధించిన సెకండ్ లుక్ కూడా విడుదల చేసారు. ఇందులో బాలయ్య లుక్ పవర్ ఫుల్ గా డైనమిక్ గా ఉందని అభిమానులు అంటున్నారు. బాలయ్య ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సినిమా బిజినెస్‌పై మంచి ప్రభావం చూపుతాయని అంటున్నారు.

ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే రొమాన్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, ఆలీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పారిశ్రామికవేత్త రమణారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు త్వరలోనే అఫీషియల్ ప్రకటన ప్రకటించే అవకాశం ఉంది.
‘ఎన్‌బికె లయన్ ' పేరు ఓకే చేసే ఆలోచనలో ఉన్నారు. టైటిల్ లో సింహం కలిస్తే బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ తో ఈ టైటిల్ నే ఖరారు చేస్తారని సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ ఖరారు కానున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











