17ఏళ్ళ తరువాత ఆ దర్శకుడితో బాలయ్య న్యూ మూవీ.. కథ సెట్ చేసిన RRR రైటర్!
నందమూరి బాలక్రిష్ణ బాక్సాఫీస్ వద్ద సక్సెల్ చూసి చాలా కాలమవుతోంది. వరుస పరాజయలతో సతమతమవుతున్న బాలయ్య నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా ఆయన గతంలో మాదిరిగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం లేదు. ఒకప్పుడు బాలయ్య సినిమాలు యవారేజ్ టాక్ తెచ్చుకున్నా మినిమామ్ వంద రోజులు థియేటర్స్ లో సందడి చేసేవి.

నరసింహానాయుడు బిగ్గెస్ట్ హిట్..
2001లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు సినిమా అప్పట్లో బాలక్రిష్ణ కెరీర్ లొనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. 105 సెంటర్స్ లో 100రోజులు ప్రదర్శించబడ్డ సినిమాగా రికార్డులు సృష్టించిన ఆ సినిమా బాక్సాఫీస్ లెక్కలు అప్పట్లో అందరిని షాక్ కి గురి చేశాయి. ఓ విధంగా ఆ సినిమా బాలయ్య కెరీర్ లొనే నెంబర్ వన్ సినిమా అని చెప్పవచ్చు.

మళ్ళీ అదే కాంబినేషన్..
బి.గోపాల్ - బాలక్రిష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే అప్పట్లో రిలీజ్ కి ముందే అంచనాలు తారా స్థాయికి చేరుకునేవి. మొత్తంగా వీరి కాంబినేషన్ లో ఐదు సినిమాలు వచ్చాయి. అందులో నాలుగు సినిమాలు మంచి విజయాన్ని అందుకోగా చివరగా వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు (2003) సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇన్నాళ్లకు మళ్ళీ ఈ కాంబినేషన్ పై చర్చలు మొదలయ్యాయి.

17ఏళ్ల తరువాత..
పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా తరువాత బాలక్రిష్ణ.. గోపాల్ తో మరొక సినిమా చేయాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక 17 ఏళ్ళ తరువాత వీరికి సరైన కథ దొరకడంతో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర వీరికోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. సాయి మాధవ్ ప్రస్తుతం RRR సినిమాకు వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.

బాలక్రిష్ణ ఇష్టంతోనే..
బాలకృష్ణ, బి.గోపాల్ అనగానే అభిమానుల్లో కొంత ఆందోళన మొదలైంది. ఎందుకంటే బి.గోపాల్ గత సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. గోపిచంద్ తో చేసిన ఆరడుగుల బుల్లెట్ అయితే రిలీజ్ కాకుండానే అటకెక్కింది. దీంతో ఫామ్ లో లేని గోపాల్ తో వర్క్ చేయడం అనేది రిస్క్ అనే అంటున్నారు. అయినప్పటికీ బాలకృష్ణ తన ఇష్టంతోనే ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా సాయి మాధవ్ అందించిన స్క్రిప్ట్ కూడా బావుండడంతో బి.గోపాల్ న్యాయం చేయగలడని నమ్ముతున్నారట.


Click it and Unblock the Notifications











