twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ‘అధినాయకుడు’లో ఓల్ట్ మేన్ గెటప్...?!

    By Sindhu
    |

    బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'శ్రీరామరాజ్యం" నవంబర్ 10న రిలీజ్ అవుతుండగా.. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న'అధినాయుడు" షూటింగ్ జరుపుకుంటోంది. బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న 'అధినాయకుడు" సినిమా షూటింగు గత రెండు రోజుల నుంచి కర్నూలులో జరుగుతోంది. పట్టణంలోని ప్రసిద్ధ కొండారెడ్డి బురుజు దగ్గర ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు.

    గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం మూడు గెటప్ లలో వృద్ధుడి గెటప్ లో వున్న బాలకృష్ణ పాల్గొనే ఎమోషనల్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. బాలకృష్ణను చూడడానికి జనం విపరీతంగా వస్తున్నారు. చిత్రంలో ఇవి కీలక సన్నివేశాలని తెలుస్తోంది. గతంలో 'ఒక్కడు" సినిమా కోసం ఇదే లొకేషన్లో షూటింగ్ చేశారు. ఈ చిత్రాన్ని కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయని విన్నవారు చెప్తున్నారు. నవంబర్ లో ఈ చిత్రం ఆడియో విడుదల కాబోతుందని వినికిడి. 'శ్రీరామ రాజ్యం" వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా 'అధినాయకుడు" రాబోతోంది.

    English summary
    Nandamuri Balakrishna currently busy shooting for Adhinayakudu movie. The above still is first and distinct look of Nandamuri Balakrishna's Adhinayakudu movie. ‘Adhinayakudu’ is the title under consideration for Balayya's film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X