శుభాకాంక్షలు తెలుపుతూ బాలయ్య ప్రకటన

By Bojja Kumar

హైదరాబాద్: నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ తన అధికారిక లెటర్ ప్యాడ్ మీద తెలుగు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసారు. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

తెలుగు నేల మీద ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఉన్న నా ఆత్మీయ అభిమానులకీ, వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు జాతి అనే ఉమ్మడి కుటుంబం మధ్య ‘గోడల' వచ్చాయి తప్ప మనుషుల మధ్య ‘తేడాలు' రాలేదు. మనందరిదీ ఒకే జాతి, ఒకే బాట, ఒకే బాష.

Balakrishna New Year Wishes to Fans

విజయవాడ అడబిడ్డ ‘వరంగల్' కోడలు కావొచ్చు. ‘హైదరాబాద్' ఆండి బిడ్డ ‘విశాఖ' అల్లుడు కావొచ్చు. తరతరాల ఈ బంధుత్వాన్ని ఎవరూ విడగొట్టలేరు. ప్రతి గుండెలో నిండిన అనుబంధాన్ని ఎవరూ చెడగొట్టలేరు. ఇది జగమెరిగిన సత్యం. తెలుగు ఖ్యాతినీ, నందమూరి వంశాన్ని నాలుగు దిక్కులా గర్వంగా చెప్పుకునేలా చేసింది నాన్నగారైన ‘నందమూరి తారకరామారావు గారు' ఆయనతో ఏరంగంలోనైనా పోటీపడటం అనితరసాధ్యం. కానీ..ఆ మహానుభావుడు అధిరోహించిన ‘నటశిఖరానకి' ఓ చిన్నమెట్టునైతే నాకదే తృప్తి.

ప్రజాసేవకి ఆయన పడ్డ శ్రమలో ఓ చెమటబొట్టునైతే నాకదే సంతృప్తి. నా రాజకీయ జీవితానికి పురుడు పోసింది హిందూపురం ప్రజలు. మనసారా ఇష్టపడి ఇంటింటి బిడ్డా ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు. ఆ ఇష్టాన్ని బ్రతికినంతకాలం నిలబెట్టుకుంటా. వాళల కష్టాన్ని ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటా. ఏ సమస్య వచ్చినా ఇంటిపెద్దబిడ్డలా వాళ్ల ముందుంటా.

Balakrishna New Year Wishes to Fans

‘ప్రాంతాలకి అతీతంగా తెలుగు వాళ్లందరూ ఆనందంగా ఉండాలి.. వారి ఆనందంలో నేనుండాలి' అన్నదే నా కోరిక దాని కోసం ఏ వూరైనా మీ వాడిగా ఉంటా. ప్రతి ప్రయత్నానికి అండగా నాకు నా ‘నా అభిమాన సైన్యం' ఉంది. వాళ్లందరికీ నా మనసులో ఓ ప్రత్యేక స్థానం ఉంది. మీరే నా బలం..మీరే నా వరం.

రుద్రపాటి రామారావు నిర్మాతగా, సత్యదేవ దర్శకత్వంలో పూర్తి కాబోతున్న చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రతో ఈ కొత్త సంవత్సరంలో మరో సంక్రాంతిలా మీ ముందుకు రాబోతున్నాను. నన్ను చూసి మీరు గర్వపడటం కాదు..మిమ్మల్ని చూసి నేను గర్వపడేస్థాయికి మీరు ఎదగాలి. ఆ అవకాశం మీకు ఈ కొత్త కొత్తసంవత్సరంలో రావాలి. మీ ప్రతి ఇల్లూ సంక్రాంతి సంబరాలతో కళకళలాడాలని మనసారా కోరుతూ...మరోసారి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X