'మిత్రుడు'తో అలరించిన నందమూరి బాలకృష్ణ ఈ సారి మరో మెగా సంచలనానికి తెరతీయనున్నారని సమాచారం. ఓ ప్రముఖ దర్శకుడు డైరక్షన్ లో ఓ చిత్రం ఆగస్టు నుంచి సెట్స్ మీదికి వెళ్లనుంది. యునైటెడ్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సంస్థ గతంలో 'రాజాబాబు', 'టక్కరి', 'గుండె ఝల్లుమంది' చిత్రాలు నిర్మించింది. ఇది నాలుగో చిత్రం. ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ కథ చర్చలు సాగుతున్నాయి. అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.