బాలయ్య తలుచుకుంటే అంతే... రంగంలోకి ఆ ఇద్దరూ!
Recommended Video

బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతి సందర్భంగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ బయోపిక్ సెకండ్ పార్ట్ 'ఎన్టీఆర్-మహానాయకుడు' ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టుల్లో బిజీ కాబోతున్నాడు.
సింహా, లెజెండ్ లాంటి బసూపర్ హిట్ చిత్రాలు అందించిన బోయపాటితో బాలయ్య మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌బికె ఫిల్మ్స్ బేనర్లో బాలయ్య నిర్మించబోతున్నారు. దీంతో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు.

బాలయ్య-వినాయక్
సి కళ్యాణ్ నిర్మాతగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చే సినిమా... బోయపాటి సినిమా తర్వాత వస్తుందని అంతా భావించారు. ఇటీవల మీడియాతో వివి వినాయక్ మాట్లాడుతూ... అతి త్వరలోనే బాలయ్యతో సినిమా మొదలు పెట్టబోతున్నట్లు తెలిపారు.

ఒకేసారి ఇద్దరితో...
ఇటు బోయపాటి సినిమాతో పాటు అటు వినాయక్ సినిమాను బాలయ్య ఒకేసారి కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ ఇవి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

బాలయ్య తలుచుకుంటే...
బాలయ్యకు క్రమశిక్షణ గల నటుడిగా పేరుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయడం ఆయన స్టైల్. ఆయన తలుచుకుంటే ఒకే సారి రెండు సినిమాలు పూర్తి చేయడం పెద్ద కస్టమేమీ కాదని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

ఎన్టీఆర్ కథానాయకుడు
కాగా... బాలయ్య నటించిన ఎన్టీఆర్-కథానాయకుడు చిత్రం ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారు అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. టాక్ బావున్నప్పటికీ బిజినెస్ పరంగా ఈ మూవీ కాస్తవెకబడి ఉందని ట్రేడ్ వర్గాల టాక్.


Click it and Unblock the Notifications











