అంకుల్ ఆంజనేయస్వామి ఎవరో తెలుసా-ఇంకెవరూ మన బాలయ్య బాబే
కోడి రామకృష్ణ దర్శకత్వంలో గతంలో 'మంగమ్మగారి మనవడు", 'ముద్దుల మావయ్య", మువ్వ గోపాలుడు, 'ముద్దుల మేనల్లుడు" వంటి విజయవంతమైన చిత్రాల్లో బాలకృష్ణ నటించాడు. మళ్ళీ వీరి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి 'అంకుల్ ఆంజనేయ స్వామి" అనే టైటిల్ ను కూడా అనుకున్నారట. ప్రస్తుతం బాలకృష్ణ 'పరమవీర చక్ర", 'శ్రీరామ రాజ్యం" చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చేసే సినిమా ఆరంభమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ అంకుల్ ఆంజనేయస్వామి కోడి రామకృష్ణ పరమవీర చక్ర శ్రీరామ రాజ్యం balakrishna uncle anjaneya swamy kodi ramakrishna parama veera chakra sri rama rajyam


Click it and Unblock the Notifications