మరో ఇద్దరి డైరక్టర్స్ తో కమియిటన బాలకృష్ణ..డిటేల్స్
బాలకృష్ణ తాజాగా మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి ముందుకొచ్చారు. దాంతో పూరీ, బెల్లంకొండ కాంబినేషన్ ఆగినట్లే. అలాగే గోపీచంద్,బి.గోపాల్ కాంబినేషన్లో నల్లమల బుజ్జి నిర్మించే చిత్రం కూడా ఆగినట్లు సమాచారం. దాంతో గంతోల సమరసింహా రెడ్డి,నరసింహానాయుడు వంటి సూపర్ కాంబినేషన్ కి మరో సారి బీజం పడినట్లయింది. అలాగే బాలకృష్ణతో పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్.కుమార చౌదరి దర్శకత్వంలో మరో చిత్రం ఓకే అయింది. పరుచూరి మురళి గతంలో పెద బాబు,ఆంధ్రుడు,రెచ్చిపో చిత్రాలు రూపొందించారు. ఈ రెండు చిత్రాలుకు తోడు దాసరి దర్శకత్వంలో రూపొందుతున్న పరమ వీర చక్ర చిత్రం షూటింగ్ జూలై 26 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమయింది.
బాలకృష్ణ పరమవీర చక్ర దాసరి నారాయణరావు బి గోపాల్ సమరసింహా రెడ్డి నరసింహ నాయుడు balakrishna parama veera chakra dasari narayana rao gopichand


Click it and Unblock the Notifications