షాకిచ్చిన బాలయ్య... ఏం చేయాలో అర్థంకాక మరో ప్రాజెక్ట్ వైపు బోయపాటి!
'వినయ విధేయ రామ' చిత్రం బాక్సాఫీసు వద్ద ప్లాప్ కావడం దర్శకుడు బోయపాటి శ్రీను మీద తీవ్ర ప్రభావం పడింది. ఆ ఫలితం కారణంగా అప్పటికే ఆయనకు కమిట్మెంట్ ఇచ్చిన కొందరు స్టార్ హీరోలు వెనకడుగు వేశారు. అలాంటి సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మాస్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరో భారీ హిట్టు కొట్టి డేంజర్లో పడ్డ తన కెరీర్ చక్కదిద్దుకోవడానికి సిద్ధమయ్యారు. బాలయ్య మూవీ కోసం స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. ఎన్నికలు లేకుంటే ఈ చిత్రం ఇప్పటికే మొదలయ్యేది. కానీ ఇపుడు ఎన్నికలు అయ్యాక కూడా మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

బాలకృష్ణ-బోయపాటి మూవీ మరింత ఆలస్యం
తాజాగా ఫిల్మ్ నగర్ అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య-బోయపాటి చిత్రం ఇప్పట్లో మొదలయ్యే అకాశం లేదని టాక్. అంతే కాదు బాలయ్య మరో దర్శకుడికి సినిమాకు కమిట్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇది పూర్తయ్యాకే బోయపాటితో మూవీ చేయబోతున్నారట.

షాకైన బోయపాటి, కారణాలే ఏమిటి?
మరి బోయపాటి సినిమాను బాలయ్య ఎందుకు ఇపుడు పక్కకు పెట్టారనేది తెలియడం లేదు. తాను స్క్రిప్టు రెడీచేసి ఎదురు చూస్తుంటే బాలయ్య మరో దర్శకుడితో సినిమాకు కమిట్ అవ్వడం ఈ యాక్షన్ డైరెక్టర్ షాకయ్యేలా చేసింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలోకి బోయపాటి నెట్టివేయబడ్డట్లయింది.

బాలయ్య నెక్ట్స్ మూవీ ఎవరితో అంటే..
ఇటీవల ‘జైసింహా' సినిమా తీసిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య తన తర్వాతి సినిమా చేయబోతున్నారు. జైసింహా చిత్రాన్ని నిర్మించిన సి కల్యాణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఇచ్చిన కమిట్మెంటులో భాగంగా బాలయ్య ఈ ప్రాజెక్టు వైపు మళ్లినట్లు టాక్.

ఈ గ్యాపులో మరో మూవీకి సిద్దమవుతున్న బోయపాటి
బాలయ్యతో సినిమా ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ గ్యాపులో ఓ యంగ్ హీరోతో బోయపాటి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి వెంటనే బాలయ్య ప్రాజెక్టు వైపు మూవ్ అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











