బాలయ్య 100వ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ!
హైదరాబాద్ : నందమూరి కుటుంబం నుంచి బాలయ్య సినీ వారసుడుగా ఆయన తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కొంత కాలంగా ఇదే విషయమై సీరియస్ గా కసరత్తు చేస్తున్నాడు. అయితే మోక్షజ్ఞ వయసు ఇంకా తక్కువగానే ఉండటంతో ఈ లోగా అతనికి నటన, డాన్స్ తదితరాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు.
మరో వైపు బాలయ్య మెల్లిమెల్లిగా సినిమాలు తగ్గించి తన దృష్టి రాజకీయాలపై పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాడు. 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాతే బాలయ్య రాజకీయాల వైపు మళ్లుతారని అంతా అనుకుంటున్నప్పటికీ అది నిజం అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. అంతకంటే ముందే ఆయన పూర్తిగా క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.
2014లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బాలయ్య అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య 100వ సినిమా 'మోక్షజ్ఞ' తొలి సినిమాగా ప్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలో బాలయ్య అతిథి పాత్ర చేయడం ద్వారా తన కొడుకు హీరోగా రూపొందబోయే తొలి సినిమాపై అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












